JGL: ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం రాత్రి కారు ఆర్టీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మల్యాల మండలం తక్కలపల్లి గ్రామం చెందిన ధూపం శివప్రసాద్ కారులో పెద్దపల్లికి వెళ్తున్నాడు. ధర్మారం మండల కేంద్రంలో కరీంనగర్ నుంచి మంచిర్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో శివప్రసాద్కు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సీవుంది.