VZM: జిల్లా బైపాస్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నామని పార్వతీపురం R&B ఏఈఈ బి.రాజేంద్ర కుమార్ తెలిపారు. ఈనెల 8వ తేదీన వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ‘ఈ దారిలో వెళ్లాలంటే గుండె దడే’ మరియు ‘అధ్వానంగా బైపాస్ రోడ్డు’ వార్తలకు స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నట్లు తెలిపారు.