KMM: ఖమ్మం కాలువవొడ్డు ప్రాంతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి పువ్వాడ అజయ్ నిర్మించిన కూరగాయల మార్కెట్ షెడ్డు నిర్మానుష్యంగా మారింది. చిరు వ్యాపారులు రోడ్డు వెంట కూరగాయలు అమ్మకాలు జరుపుతున్నారనే ఉద్దేశంతో నాడు 56 షాపులతో కూడిన షెడ్డు ఏర్పాటు చేశారు. కానీ ఎవరూ వినియోగించడం లేదు. యథావిధిగా రోడ్డు వెంట 4 చక్రాల బండ్లు పెట్టి అమ్మకాలు చేస్తున్నారు.