ఏలూరు: జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అగిరిపల్లి మండలంలో 11.2 మిల్లీమీటర్లు, పెదపాడులో 9.2 మిల్లీమీటర్లు, కామవరపుకోటలో 4.2 మిల్లీమీటర్లు, ద్వారకాతిరుమలలో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా 24 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 27.2 మిల్లీమీటర్లు, సగటు వర్షపాతం 1 మి.మీ.గా అధికారులు తెలిపారు.