BHNG: ప్రజాకవి కాళోజీ నేటి సమాజంలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రధాత అని, వారి రచనలు అనేక మంది చైతన్యం వైపు నడిపించాయని ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 111 వ జయంతి సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజలను చైతన్యపరిచే విధంగా కాళోజీ అనేక రచనలు చేశారన్నారు.