KMR: బిచ్కుంద మండలం దేవాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, అందుకే తాము పార్టీ మారుతున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు.