KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, అటవీ, పంచాయతీ రాజ్, విద్యా, ఆరోగ్య, పర్యాటక శాఖల అధికారులతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన ఆరా తీసి వాటిని పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశించారు.