AKP: గొలుగొండ మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయాధికారి కే.సుధారాణి తెలిపారు. ఇప్పటికే రైతు సేవా కేంద్రాల ద్వారా 44 మెట్రిక్ టన్నుల యూరియా అందజేశామన్నారు. మరో 72 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు చెప్పారు. యూరియా అందుబాటులో లేదనే అపోహలు రైతులకు వద్దని, రైతులందరికి యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.