ATP: అనంతపురంలో ఈనెల 10న సూపర్ సిక్స్ సూపర్ హిట్ రాష్ట్రస్థాయి సభకు సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సభ ఏర్పాట్లు పనులను రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, అచ్చం నాయుడు, సత్య కుమార్, సవిత పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.