నేపాల్ ప్రధాని కేపీ ఓలి హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సైన్యం ఆయనను ఒక రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి ఆయన దుబాయ్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ఈ సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.