GST రేట్లకు సంబంధించి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత్ స్టాక్కూ MRP సవరించే అవకాశాన్ని కంపెనీలకు కల్పించింది. దీంతో కొత్త స్టాక్ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. పాత స్టాక్ ధరలు కూడా తగ్గనున్నాయి. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. సవరించిన ధరలను స్టాంపింగ్, స్టిక్కర్ లేదా ఆన్లైన్ ప్రింటింగ్ ద్వారా మార్చుకోవచ్చని ఆదేశించింది.