W.G: జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల నోటిఫికేషన్ రద్దు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 30న కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. పరిపాలన కారణాలవల్ల సదరు నోటిఫికేషన్ రద్దు అయ్యిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.