WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో ముకేష్ రావు (22) అనారోగ్యంతో మృతి చెందాడు. మట్టపల్లి తిరుపతి రావు, రజిత దంపతుల ఒక్కగానొక్క కుమారుడైన ముకేష్ డిగ్రీ పూర్తి చేశాడు. కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతూ, ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ మృతి చెందాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.