TG: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రానికి సంభవించిన నష్టంపై ఆర్థిక మంత్రి నివేదిక అందజేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు చామల, మల్లు రవి, రఘురాం రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య కూడా ఉన్నారు.