RR: బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీసులను ఘనంగా సన్మానించారు. అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకి రెడ్డి, పలువురు పోలీసు అధికారులను శాలువాతో సన్మానించి స్మృతి చిహ్నాలను అందజేశారు.