GNTR: గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరులో మంగళవారం ‘యూరియా మీ చెంతకు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు 40 మెట్రిక్ టన్నుల యూరియా, 10 మెట్రిక్ టన్నుల డీఏపీని పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి కిషోర్ తెలిపారు. రాబోయే పదిహేను రోజుల్లో అన్ని గ్రామాలకు యూరియా అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.