JDWL: ధరూర్ మండలంలోని విద్యుత్ అధికారులు ప్రజల ప్రాణాలకు విలువ ఇచ్చి ట్రాన్స్ఫార్మర్ల రక్షణకు, తొలగింపునకు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలపై అధ్యయనంలో భాగంగ మంగళవారం ధరూర్ మండలంలోని నెట్టెంపాడు, నాగర్ దొడ్డి గ్రామాలలో ప్రజలను కలిసి సర్వే నిర్వహించారు.