KDP: జమ్మలమడుగు సబ్-డివిజన్ పరిధిలోని 9 పోలీస్ స్టేషన్లలో పోలీస్ యాక్ట్ 30 నేటినుంచి ఈనెల 30వ తారీకు వరకు అమలులో ఉంటుందని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు DSP తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు సబ్-డివిజన్ పరిధిలో ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు ధర్నాలు చేయరాదని అన్నారు.