KMM: మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో ₹45 లక్షల నిధులతో పలు సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు Dy.CM భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యం, గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.