NZB: పోతంగల్ మండల హేగ్డోలి పీహెచ్సీ, సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో పరిశీలించారు. నిర్మాణానికి అనుకూలంగా మార్చేందుకు అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ గంగాధర్, సర్వేయర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.