నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఆశ్రయం కోసం దుబాయ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ విమానం కూడా ఆయన ప్రయాణం కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, వైద్య చికిత్స కోసం ఆయన దుబాయ్ వెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు దేశంలో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశానికి ఓలీ పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపారు.