E.G: జిల్లా జాయింట్ కలెక్టర్గా వై.మేఘా స్వరూప్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తనవంతు కృషి చేయాలన్నారు.