KMM: స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తి నింపిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు మధిర బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్, మధిర బీఆర్ఎస్ ఇంఛార్జ్ లింగాల కమల్రాజు ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన కాళోజీ సేవలను స్మరించారు.