MBNR: విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నభోజనంలో నాణ్యత పాటించాలని MLA మధుసూదన్ రెడ్డి సూచించారు. మంగళవారం భూత్పూర్ మండలం తాటిపర్తిలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి మధ్యాహ్నభోజనాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.