SRCL: జ్వరం వచ్చిన వారిని గుర్తించి రక్త పరీక్షలు చేసే వెంటనే చికిత్స అందించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. రుద్రంగి మండలం మానాలలో జరిగిన డ్రైడే కార్యక్రమాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటి ఆవరణలో నీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు.