VSP: ఆరిలోవలో మంగళవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ముడసర్లోవ నుంచి సింహాచలం వైపు బైక్పై వెళ్తున్న హరీష్, గోవింద్ రాజు ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో హరీష్ పరిస్థితి విషమంగా ఉంది అని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను కేజీహెచ్ఎల్లో చికిత్స అందిస్తున్నారు.