E.G: రంగంపేట మండలంలో మంగళవారం కలెక్టర్ ప్రశాంతి ఆకస్మికంగా పర్యటించారు. యూరియా అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులతో సమావేశమై రసాయన ఎరువుల వినియోగంతో వచ్చే దుష్ప్రభావాలను వివరించారు. ఎరువుల లభ్యతపై ఆందోళన అవసరం లేదని తెలిపారు.