కృష్ణా: ఢిల్లీలో లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ,రైల్వే ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ గురించి రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులతో ఎంపీ బాలశౌరి చర్చించారు. డీపీఆర్‌ను తయారు చేసి, అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.