KRNL: ఆదోని మాజీ MLA సాయి ప్రసాద్ రెడ్డి ఇవాళ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ‘అన్నదాత పోరు’ కార్యక్రమంలో భాగంగా వైసీపీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కుడివైపు భాగంలో పట్టేసినట్లు ఉండటంతో ఊపిరి తీసుకోవడానికి స్వల్పంగా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ ఎలాంటి సమస్య లేదన్నారు.