NZB: సిరికొండ మండలం కొండాపూర్ గోప్య తండా పరిధిలోని గంటతాండలో విషాదం మంగళవారం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు చెరువుకు వెళ్లిన శంకర్ చెరువులో పడి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ చేపల వేటకు వెళ్లగా.. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకి పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు.