CTR: ‘సూర్య ఘర్’ కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలం గుండి శెట్టిపల్లిలో 10 ఇళ్లలో సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేసినట్లు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు అనసూయ తెలిపారు. నియోజకవర్గంలో 50 వేల ఇళ్లకు సూర్య ఘర్ ద్వారా ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి తొమ్మిది వేల ఇళ్లకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.