SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన వివాహిత ఈరవేన రమ్య మంగళవారం ఇంట్లో ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రమ్య ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. సంఘటన స్థలానికి ఎస్సై రాహుల్ రెడ్డి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం సృష్టించింది.