ప్రకాశం: మార్కాపురం, గిద్దలూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారి ఉమాకాంత్ తెలిపారు. ఇవాళ నుంచి నవంబర్ 25 వరకు ఈ రైలు జిల్లా గుండా తిరుపతికి చేరుకోనుందని తెలిపారు. ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి రాత్రి 9.10 గంటలకు బయలుదేరి జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు స్టేషన్ల మీదుగా నంద్యాలకు చేరుతుందని అక్కడి నుంచి తిరుపతికి వెళుతుందన్నారు.