KRNL: పెండింగ్లో ఉన్న ఉపాధి వేతనాలను తక్షణమే చెల్లించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ పెద్దకడబూరు MPDO కార్యలయంలో వినతి పత్రం అందజేశారు. దాదాపు 8 వారాలుగా వేతనాలు చెల్లించలేదని వాపోయారు. అలాగే ఇంటిపన్నుల వసూళ్లు నగర పంచాయితీ, కార్పొరేషన్ తరహాలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి దినాలు 200 రోజులకు పెంచాలన్నారు.