MBNR: ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఇందిర అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో భూత్పూర్ మండలం అమిస్తాపూర్లోని బీసీ గురుకుల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యరు.