KMR: విద్యార్థులకు వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారులకు సూచించారు. మంగళవారం లింగంపేట రైతు వేదికలో నియోజకవర్గంలోని హాస్టల్ వార్డెన్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి వసతి గృహంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు.