వాట్సాప్ వెబ్ వినియోగదారులు ప్రస్తుతం ఒక సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ చాట్ ఫీడ్‌ను స్క్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మౌస్ స్క్రోల్ సరిగా పనిచేయడం లేదని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య ఇటీవల వచ్చిన అప్డేట్లో భాగంగా వచ్చిందని భావిస్తున్నారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.