VSP: రాష్ట్రంలోని అన్ని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాపులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జీసీసీ అధికారులను ఆదేశించారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ఆమె సూచించారు. మంగళవారం విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న జీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.