VZM: ఎస్.కోట మండలం మూల బొడ్డవరం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో బాగంగా రైతులకు యూరియా, నానో వాడకంపై కొత్తవలస వ్యవసాయ సహాయ సంచాలకులు భానులత వివరించారు. యూరియా వాడకం తగ్గించి, తద్వారా పురుగు ఆశించే అవకాశం తగ్గి, పెట్టుబడి తగ్గుతుందని చెప్పారు. ఆర్.ఎస్.కె.లో జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమం పరిశీలించారు.