HYD: బీజేఆర్ కాలేజీలో కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవం ప్రిన్సిపల్ విజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమ గళం తూర్పు మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళోజీ జీవిత, రచనా విశిష్టతలను వివరించారు. కాళోజీ ‘నా గొడవ’ అనే కవితా సంకలనంలో తెలంగాణ భాష, యాస ప్రయోగించిన మొదటి, ప్రసిద్ధ కవి అన్నారు.