BDK: ఉపాధ్యాయులు నిరంతరం నూతన మెళకువలను నేర్చుకుని విద్యార్థులకు విద్యను నేర్పించాలని ఎంఈవో ఎం. సత్యనారాయణ సూచించారు. మంగళవారం మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను, అభ్యాసన బోధన సామాగ్రి మేళాను చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని వారు కోరారు.