ELR: మోతాదుకు మించి ఎరువుల వినియోగం వలన కలిగే అనర్థాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కలిగించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల సరఫరా, పంపిణీలపై మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎరువులకు ఎటువంటి కొరతా లేదన్నారు.