ELR: ఏలూరు ఆర్డీవో కార్యాలయం వద్ద మంగళవారం వైసీపీ నేతలు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసు బాబు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.