GNTR: గుంటూరులోని కొరిటెపాడులోని ఎస్ఆర్ఎం ఓరియంటల్ హైస్కూల్లో మంగళవారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు మార్గదర్శకాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కెరీర్ కౌన్సెలింగ్ ట్రైనర్ వీర రాఘవరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ముందుగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.