KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్ల గ్రామంలో ఇంటి పరిసరాల పరిశుద్ధిపై డీపీవో భాస్కర్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంగళవారం తడి చెత్త, పొడి చెత్త వేరుగా ఉంచుకొని చెత్త బండి ఇంటి వద్దకే వచ్చినప్పుడు వేయాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు.