SRD: విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షలు లోపబుయిష్టంగా నిర్వహించి చేతులు దులుపుతుందని విమర్శించారు. పరీక్షలు ఎలా నిర్వహించాలో సోయి కూడా ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.