సత్యసాయి: వైసీపీ ఫేక్ ప్రచారాలు రైతులు నమ్మవద్దని హిందూపురం TNSF అధ్యక్షుడు యుగంధర్ అన్నారు. మంగళవారం హిందూపురంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు కావాల్సినంత యూరియా సకాలంలో అందిస్తోందన్నారు. గత వైసీపీలో రైతులకు 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు.