MBNR: కోయిలకొండ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఎంపీడీవో ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన రచనల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై గళ మెత్తారు. తెలంగాణ ఉద్యమంలో భాష, యాస అనే అంశాలతో క్రియాశీలకంగా పాల్గొన్న వ్యక్తిగా ఆయన అభివర్ణించారు.