BDK: పాల్వంచ మండలం శేఖరం బంజారా గ్రామానికి చెందిన రైతులు బాలు నాయక్, సామా నాయక్ మంగళవారం వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ల్యాండ్ లూజర్ కోటాలో కేటీపీఎస్ యాజమాన్యం 1997 సంవత్సరంలో రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం భూములు తీసుకుని ఇప్పటివరకు ఉపాధి అవకాశం కల్పించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.