KDP: సింహాద్రిపురం మండలంలోని బలపనూరు, అంకాలమ్మ గూడూరు, కోరగుంటపల్లె మిగిలిన అన్ని గ్రామాలు కలిపి 200 బస్తాల యూరియా మంజూరైనట్లు స్థానిక వ్యవసాయ అధికారి కళ్యాణ్ కుమార్ తెలిపారు. వీటిని గ్రోమోర్ సెంటర్లలో విక్రయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అన్నదాతలు పంట సాగు చేసిన సమయంలో అధికారుల సలహాలు చూసిన తీసుకోవాలని పంట నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు.